Header Banner

కేంద్రానికి బిగ్ షాక్.. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టే! 73 పిటిషన్లతో కలకలం!

  Thu Apr 17, 2025 15:52        Politics

పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పలు వివాదాస్పద క్లాజ్ లతో కూడిన వక్ఫ్ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఇవాళ దీనిపై ముందుకెళ్లొద్దని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే తమ ఆదేశాలపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో ముస్లింలకు ఊరట దక్కినట్లయింది. దేశంలోని ముస్లిం దాతృత్వ ఆస్తుల నిర్వహణను నియంత్రించే చట్టాలలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ రెండోరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు "వక్ఫ్ నియామకాలు ఉండవని, అలాగే ప్రస్తుత స్ధితిలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చడం వంటి చట్టంలోని కొన్ని భాగాల అమలును సుప్రీంకోర్టును మే 5 వరకూ నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

అప్పటి వరకు ఈ చట్టంలోని 'వక్ఫ్ బై యూజర్' నిబంధనను కూడా డీనోటిఫై చేయరాదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అప్పటివరకూ వక్ఫ్ బోర్డులకు ఎలాంటి నియామకాలు జరగవని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. వక్ఫ్ చట్టంలో భారీ మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లోనూ కేంద్రం ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే కేంద్రంతో పాటు ప్రతివాదులుగా ఉన్న ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాల లాయర్లు వద్దని కోరారు. ఈ చట్టంలోని పలు క్లాజ్ లపై సుప్రీంకోర్టు నిన్న అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవాళ జరిగిన విచారణలో ఏకంగా స్టేటస్ కో ఇచ్చేసింది.

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SupremeCourt #WakfAct #CentreVsCourt #LegalBattle #WakfPetitions #SCStay #BigShockToCentre